TG | బాల్య దశ నుంచే దేశ భక్తిని పెంపొందించాలి

TG | బాల్య దశ నుంచే దేశ భక్తిని పెంపొందించాలి
TG |వర్ని, ఆంధ్రప్రభ : విద్యార్థి దశ నుంచే బాలలకు దేశభక్తి పెంపొందించడానికి కృషి చేయాలని మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ జనార్ధన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా వర్ని మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి రుద్రూర్ గ్రామ పంచాయతీ వరకు ఆదివారం 7 కే రన్ నిర్వహించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగింది. మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ అభివృద్ధి పట్ల, ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి హక్కులతో పాటు బాధ్యతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, గౌరవ సలహాదారులు ఇందూరు చంద్రశేఖర్, బచ్చు రామ్ సెట్, బెజుగం వెంకటేశం, దర్శి సాయిలు, సభ్యులు కర్రోళ్ల శివప్రసాద్, నూతిపల్లి బాల రాజ్, నవీన్ గౌడ్, మల్లారెడ్డి ప్రధానోపాధ్యాయులు భాస్కర్,బండారు సురేష్, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
