TG | అవగాహన సమావేశం..

TG | అవగాహన సమావేశం..

  • జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్,

TG | చిట్యాల, ఆంధ్రప్రభ : సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేయడం రైతు అలవాటు చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ సూచించారు. శనివారం జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా జడ్జి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అన్నారు. చట్టపరమైన రైతు సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఎరువుల షాపులు, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాల పర్యవేక్షణ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్ కి జడ్జి పలు సూచనలు చేశారు.

TG

ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి. శ్రీనివాస్, స్పెషల్ పి.పి.నిమ్మల విష్ణువర్ధన్, చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, మండల వ్యయసాయ అధికారి శ్రీనివాస రెడ్డి, న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్, కొత్తూరి మహేందర్ రెడ్డి, పారా లీగల్ వాలంటీర్ ఆరేపెల్లి తిరుపతి, రైతులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ఏఆర్ పల్లి సర్పంచి కొడారి అశోక్, చిట్యాల ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు తవటం నవీన్, రైతులు కనుకుల లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, ఎలేటి శ్రీనివాస్, మర్రి నరేష్, బిళ్ళ సత్యనారాయణరెడ్డి, చెక్క నరసయ్య, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

TG

Leave a Reply