TG | ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు

TG | ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు
విద్యాశాఖ అధికారి తిరుపతయ్య
TG | జుక్కల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం కప్-2025 క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది.జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే క్రీడా పోటీలు నిర్వహించి, ప్రతిభావంతులైన క్రీడాకారులకు నియోజకవర్గస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. ఇది ఇలాఉండగా జుక్కల్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జుక్కల్ లో ఈనెల 5 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు జుక్కల్ మండల విద్యాశాఖఅధికారి తిరుపతయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5న జుక్కల్ జిల్లాపరిషత్ హైస్కూల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, దీంతో పాటు ఈనెల 6న కూడా జుక్కల్ హైస్కూల్లోనే కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నామని, అథ్లెటిక్స్ పోటీలు మాత్రం జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి హైస్కూల్ ప్రాంగణంలో ఈనెల 7న నిర్వహించటం జరుగుతుందని, ఈపోటీలన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఎంఈఓ తిరుపతయ్య తెలిపారు. ఈనియోజకవర్గ స్థాయిపోటీలలో జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన ఎంపిక చేసిన క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. క్రీడాకారులందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
