TG | పల్లె దవాఖాన ప్రహరీ గోడ నిర్మించండి సారూ…!

TG | పల్లె దవాఖాన ప్రహరీ గోడ నిర్మించండి సారూ…!

TG | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పల్లె దవాఖాన కు ప్రహరీగోడ నిర్మించాలని దవాఖాన సిబ్బంది గ్రామస్తులు కోరుతున్నారు. దవాఖాన కు ప్రహరీగోడ లేకపోవడంతో రాత్రి వేళలో మందు బాబులకు అడ్డగా మారింది. రోజు హాస్పిటల్ తెరిచే సమయానికి ఖాళీ సీసాలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. దవఖాన ముందర కుక్కలు పందులు స్వైర విహారం చేయడంతో వాటి దుర్వాసనకు దవఖానకు వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గుతుందన్నారు. దవఖానకు ప్రహరీ గోడ నిర్మించాలని గతంలో కూడా అధికారుల మొరపెట్టుకున్న లాభం లేకుండా పోయిందన్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, సంబంధిత అధికారులు స్పందించి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Leave a Reply