TG | కేసీఆర్‌కు సిట్ నోటీసులపై నిరసనలు

TG | కేసీఆర్‌కు సిట్ నోటీసులపై నిరసనలు
- మంచిర్యాలలో బైక్ ర్యాలీ
TG | మంచిర్యాల, ఆంధ్రప్రభ : సిట్ పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆదివారం భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ సర్కారుకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడి పై రాజకీయ వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు.
ఫోన్ టాపింగ్ అంటూ కాంగ్రెస్ రెండేళ్లుగా గులాబీ పార్టీపై అసత్యపు ప్రచారాలు చేయడం సరైనది కాదన్నారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన మహనీయుడిని ఇబ్బంది పెట్టడం సరికాదని తెలంగాణ ప్రజలందరూ వీటిని గమనిస్తున్నారని రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పెద్ద ఎత్తున గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
