TG | మున్సిపల్ పోరులో.. సామాజిక సేవకుడు, యువకుడు

TG | మున్సిపల్ పోరులో.. సామాజిక సేవకుడు, యువకుడు

TG | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 1 వ వార్డు లో కౌన్సిలర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామాజిక సేవకుడు, యువకుడు పల్లెర్ల వెంకన్న బరిలోకి దిగాడు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బి ఫామ్ సైతం కన్ఫర్మ్ కావడంతో.. ప్రచారం లో ముందంజలో ఉన్నాడు. వార్డులో ఇప్పటికే సోషల్ మీడియా వాట్సప్, స్టేటస్ లు, ఫోన్ వాయిస్ కాల్స్ చేస్తూ నిత్యం వార్డులోని ఓటర్లను ఆకర్షిస్తున్నాడు.గత 4,5 ఏండ్ల క్రితం కరోనా సమయంలో, వినాయక, దుర్గామాత విగ్రహాలు ఇప్పించడం,అన్నదానాలు చేయడం, మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ లో కీలక సభ్యునిగా పని చేస్తూ, తన వంతుగా నిరుపేదలకు ఆర్ధిక సహాయం చేస్తూ …సామాజిక సేవలు చేస్తూ …పల్లెర్ల వెంకన్న వార్డు ఓటర్లను ఆకర్షిస్తున్నాడు.నిరుపేద కుటుంబంలో జన్మించిన తనకు ఈ ఒక్క సారి అవకాశం ఇచ్చి … 1 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపిస్తే నీతి,నిజాయితీగా పని చేసి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజాసేవలో నిమగ్నమవుతానని, వార్డ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వార్డ్ అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతానని…1 వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లను అభ్యర్ధిస్తున్నాడు.

Leave a Reply