Warangal | వరంగల్ జిల్లా కోర్టులో టెన్ష‌న్ టెన్ష‌న్‌

Warangal | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావ‌డంతో లాయర్లు, కక్షిదారులు, ప్రజలు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో కోర్టు ఆవ‌ర‌ణ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉంది. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. కోర్టులోని ప్రతి గదిని, మూలమూలలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింద‌నే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన లాయర్లు, కక్షిదారులు, ప్రజలు ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Leave a Reply