Tempo Travel | లారీని ఢీ కొట్టిన టెంపో ట్రావెల్స్…

Tempo Travel | లారీని ఢీ కొట్టిన టెంపో ట్రావెల్స్…
Tempo Travel | పల్నాడు జిల్లా (వినుకొండ) ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో పెను ప్రమాదం తప్పిందని స్ధానికులు తెలిపారు. టెంపో ట్రావెల్ బస్సు లో మధురవాడ నుంచి మెడికల్ కాలేజీ విద్యార్థినీలు శ్రీశైలం వెళుతుండగా… మార్గ మధ్యలో శావల్యాపురం దగ్గరికి వచ్చేసరికి ముందు వెళుతున్న లారీ ఆకస్మికంగా స్లో కావడంతో, టెంపో ట్రావల్ లారీ ని వెనుక నుంచి ఢీ కొట్టింది…
ఈ ప్రమాదంలో ట్రావల్ డ్రైవర్ కు, పలువురు మెడికల్ కాలేజీ విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
