temples | శివరాత్రి …శోభ

temples | శివరాత్రి …శోభ

  • ముస్తాబైన శివాలయాలు

temples | కుంటాల, ఆంధ్రప్రభ : శివరాత్రి ఉత్సాహాలు పురస్కరించుకొని ఆలయాల్లో ఆలయాల్లో భజనలు జాగరణ చేసేందుకు వసతులు కల్పిస్తున్నారు. ఉపవాస దీక్షలు విరమించేందుకు గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సోమవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల ముస్తాబ్ చేస్తున్నారు.

సరిహద్దులో సూర్యాపూర్ రాజరాజేశ్వర ఆలయం

మండలంలోని సూర్యాపూర్ గ్రామానికి కిలోమీటర్ దూరాన మహారాష్ట్ర సరిహద్దులో గల చెరువు, వాగు పక్కన రాజరాజేశ్వర ఆలయం వెలసింది. గతంలో ఇక్కడ మూడు పురాతన విగ్రహాలు ఉండేవని గ్రామస్తులు చెప్తుంటారు. నీటి వద్ద ఓలా గ్రామానికి చెందిన తిప్ప గజ్జారం ఉపవాస దీక్షతో పూజలు చేసేవారు. ఇతను కేవలం పాలు తాగే వారు. అనంతరం గ్రామస్తులతో చర్చించి ఆలయ నిర్మాణానికి రూపకల్పన వేశారు.

temples |

ఈ సందర్భంగా కుంటలకు చెందిన దూదేకుల బాబు అనే వ్యక్తి ఆలయ నిర్మాణానికి త‌నవంతు కృషి చేస్తానని ముందుకు వచ్చారు. శిల్పాలు చెక్కడంతో ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 1972 లో ఆలయం నిర్మాణం పూర్తి చేశారు. 5 సంవత్సరాలు తర్వాత శివరాత్రి ఉత్సవాలు, కుస్తీ పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే ప్రచారానికి శ్రీకారం చుడుతుండడం ప్రత్యేకత..

ఓలా లో లింగమూర్తి శివాలయం..

కోలా పురాతన లింగమూర్తి శివాలయం ఉంది. 150 ఏళ్ల క్రితం పూర్తి రాతి కట్టడితో నిర్మించినట్టు గ్రామ పెద్దలు చెప్తుంటారు. శివరాత్రి పండుగ దినాల్లో భక్తులు భజనలు, పూజలు జరుపుతారు. గ్రామస్తులు తాము కొంత మొత్తం జమ చేయడంతో పాటు కొంత సేకరించి శివరాత్రి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ శివారులో సునీతమైన స్థలం ఉంది. ఉపవాస దీక్షలు పాటించిన‌ భక్తులు ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు, దీక్షలు విరమించేందుకు ఇష్టపడతారు. మెదన్ పూర్, అంబుగాం, లింబ, కె లింబ, బి కుంటాల, విట్టాపూర్, పెంచికల్పాడు, తదితర గ్రామాల ప్రజలు ఉత్స‌వాల‌కు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 2018లో ప్రభుత్వం 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా నూతన శివాలయం ఆలయాన్ని నిర్మించారు.

దౌనెల్లి శివాలయంలో కుంటాల ఆత్మలింగం శివాలయం, పెంచికల్ పాడు శివాలయం, కల్లూరు మార్కండేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల భక్తులు నిర్మల్ బైంసా పట్టణాలతో పాటు ఆయా మండలాల నుంచి భక్తులు మండలంలోని ఆలయాలను దర్శించుకుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు, వసతులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply