కొలువుదీరారు

కొలువుదీరారు

ఆలయ సంప్రదాయాలు కొనసాగాలి
మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వర్లు


గుడివాడ, ఆంధ్రప్రభ : దేవాలయ ఆస్తుల పరిరక్షణ, సనాతన ఆలయ సంప్రదాయలు కొనసాగే విధంగా నూతన పాలకవర్గం పనిచేయాలని గుడివాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వర్లు (Ravi Venkateshwarlu) కోరారు. గుడివాడ నియోజకవర్గం బొమ్ములూరులో గల శ్రీ స్వమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకారంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని దేవాలయల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని తెలిపారు.

చిన్న దేవాలయాల్లో పనిచేస్తున్న పురోహితులకు జీతభత్యాలు కూడా ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు. ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డ్ (Temple Committee Trust Board) చైర్మన్ గా లింగం జానకి రాంప్రసాద్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా లింగం స్వామి వెంకట్,సొంఠి నాగ భార్గవి, ఉప్పులూరు గంగాభవాని, బోయిన సుబ్బారావు, యడవల్లి లలిత శ్రీ, దేవరపల్లి పద్మావతి, ఉసల.నాంచారయ్య, జే.సునీత ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్రావు, పిన్నమనేని చంటిబాబు, లింగం ప్రసాద్, ఆలయ కార్య నిర్వహణ అధికాని శిరీష, ఆలయ ప్రధాన అర్చకులు పాంచ జన్య పీఠం వంశ వారసులు యడవల్లి పాండురంగారావు, సోషల్ వెల్ఫేర్ వడ్డాది రంగనాథ్ పాల్గొన్నారు.

Leave a Reply