Temple | శివభక్త మార్కండేయ దేవాలయంలో…

Temple | శివభక్త మార్కండేయ దేవాలయంలో…

  • ఘనంగా దత్త హోమం
  • ఎన్నారై ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి అన్నదానం

Temple | కరీమాబాద్, ఆంధ్రప్రభ : దత్త జయంతిని పురస్కరించుకొని 34వ డివిజన్(34th Division) శివనగర్ శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో హోమం నిర్వహించారు. ఈ రోజు దేవాలయంలో పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా ఆలయ పూజారులు ముదిగొండ అభిషేక్ ముక్కు కృష్ణ, దేవాలయ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వడ్నాల సదానందం ఆధ్వర్యంలో దత్త హోమం నిర్వహించారు.

దత్త జయంతి పర్వదినం రోజు దత్త హోమం నిర్వహించినట్లయితే ప్రజలంతా పాడిపంటలతో, సుఖ సంతోషాలతో విరాజిల్లుతారని పూజారులు పేర్కొన్నారు. హోమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేవాలయం(Temple)లో స్వామి వారికీ అభిషేకం, దత్త మూల మంత్ర హోమం నిర్వహించారు. అన్నప్ర‌సాదానికి ఎన్నారై దాతలు వరదవేంకటముని శ్యామ్, శ్రావ్య దంపతులు వడ్నాల సదానందం, పద్మ, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply