Telangana | సుమారు 46.85 కిలోలు స్వాధీనం..

Telangana | సుమారు 46.85 కిలోలు స్వాధీనం..

Telangana | -పోలీసుల అప్రమత్తతతో ఇద్దరు అరెస్ట్
-రూ.23 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
-రైల్వే స్టేషన్ వద్ద నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు
-నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు
-వివరాలు వెల్లడించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మనీషా నెహ్రా

Telangana | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పోలీసుల అప్రమత్తతతో సుమారు 46.85 కిలోల భారీ గంజాయి పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరా లను శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి మనీషా నెహ్రా వెల్లడిం చారు. గురువారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఎస్ఐ పిట్ట రాజేష్ సిబ్బందితో కలిసి పట్టణంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పు డు ఒక పురుషుడు, ఒక మహిళ ఐదు బ్యాగులతో అనుమానాస్పదం గా తిరుగుతున్నట్లు గమనించారు. పోలీసులు వారిని ప్రశ్నిం చేందుకు ముందుకు వెళ్లగా, పోలీసుల రాకను గుర్తించిన ఆ ఇద్దరు అక్కడి నుం చి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

అయితే అప్రమత్తంగా స్పం దించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అనం తరం వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితులు సత్యరంజన్ బారెల్, దీప్తి మాయి స్వైన్‌లుగా గుర్తించారు. వారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి మహారా ష్ట్రలోని ముంబాయి దాదర్ ప్రాంతానికి గంజాయిని అక్రమంగా తర లించి విక్రయించడం ద్వారా అధిక లాభాలు పొందాలని యత్నిస్తున్నట్లు అంగీకరించారు. మొత్తంగా నిందితుల వద్ద నుంచి సుమారు 46.85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

అదనంగా రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,690 నగదు, ట్రైన్ టికెట్‌ను కూడా పోలీసులు జప్తు చేశారు. పట్టుబడిన గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.23.20 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై ట్రైనీ ఐపీఎస్ అధికారి మనీషా నెహ్రా పర్యవేక్షణలో నింది తులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో ఎస్ఐ మనీషా ఉన్నారు.

Leave a Reply