Telangana | జ‌న జాగృతి రైల్ రోకో వాయిదా – ప్ర‌క‌టించిన క‌విత

హైద‌రాబాద్ – బిసిల‌కు(BC ) 42 శాతం రిజ‌ర్వేష‌న్ (reservation ) క‌ల్పిస్తూ ఆర్టినెన్స్ (ordinance) ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాము నిర్వహించతలపెట్టిన రైల్ రోకోను (rail roko ) నిరవధిక వాయిదా (Postpone )వేస్తున్నట్లు జ‌న జాగృతి వ్య‌వ‌స్థాకురాలు, (Jang jagruthi ) బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (ML kavitha ) ప్ర‌క‌టించారు.. హైద‌రాబాద్ లో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ విజయం అని పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా గవర్నర్ ఆపితే మళ్లీ రైల్ రోకో తప్పదని హెచ్చరించారు. బీజేపేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నమెంట్ కు గవర్నర్లకు మధ్య పంచాయితీలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ఆర్డినెన్సులు, బిల్లులు పంపితే సంతకాలు పెట్టకుండా గవర్నర్లు ఆపుతున్నారు. తెలంగాణలో అదే పరిస్థితి వస్తే మాకు ఉద్యమాలు కొత్తకాదని మళ్లీ ఉద్యమం చేస్తామని రైళ్లు, బస్సులను స్తంభింపచేస్తామన్నారు.

Leave a Reply