Temple | దుర్గమ్మ సన్నిధిలో ..తెలంగాణ సీఎం సోదరుడు
Temple | (విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో కనక దుర్గమ్మ తల్లి సన్నిధిలో తెలంగాణ సీఎం (CM) రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆయన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, వేద పండితులు జగదీశ్వర రెడ్డికి స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాలు పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రెటరీ రాంప్రసాద్ ఆలయ అధికారులు పాల్గొన్నారు.

