Telangana CM | చెనాకా కోరాటా బ్యారేజీ, సదర్ మార్ట్ ప్రాజెక్టులకు శ్రీకారం

Telangana CM | చెనాకా కోరాటా బ్యారేజీ, సదర్ మార్ట్ ప్రాజెక్టులకు శ్రీకారం
- ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సాగు జలాలు విడుదల
- పదేళ్లకు ప్రాజెక్టులు సాకారం.. ఆయకట్టు రైతుల్లో ఆనందం
Telangana CM | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గోదావరి, పెన్ గంగా పరివాహక ప్రాంతాల్లో పదేళ్ల కిందట చేపట్టిన రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని లోయర్ పెనుగంగా పై నిర్మించిన చెనాకా కోరాటా బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పంప్ హౌస్ వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ బేలా బోరజ్, బీంపూర్ మండలాలకు 51 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా బీడు భూములు సస్య శ్యామలం కానున్నాయి.
Telangana CM | భూ పరిహారం కింద రూ. 71 కోట్లు రైతులకు అందజేత..
సీఎం రేవంత్ రెడ్డి చెనాకా కోరాటా బ్యారేజీ నుంచి 0.81 టీఎంసీల నీటిని (Water) ఎత్తిపోసే ప్రధాన కాలువకు పూజలు చేశారు. జైనథ్, బేల,బోరజ్ మూడు మండలాల పరిధిలో 42 కిలోమీటర్లు కాల్వల నిర్మాణం చేపట్టగా పూజలు చేసి పెన్గంగా జలాలను దిగువకు వదిలి పెట్టారు. రూ. 1,891 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కు ఇప్పటివరకు రూ 1,105 కోట్లు వెచ్చించారు. చెనాక కోరట ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana CM | సదర్ మాట్ బ్యారేజీ నీటిని విడుదల చేసిన సీఎం..
నిర్మల్ జిల్లా మామడ మండలం పోనకల్ వద్ద పదేళ్ల కిందట చేపట్టిన సదర్ మాట్ బ్యారేజీ (Barrage) ద్వారా గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి దిగువ ఆయకట్టుకు వదిలిపెట్టారు. గోదావరి జలాలను నిల్వ సామర్థ్యం పెంచుకునేలా ఈ బ్యారేజీ నిర్మించారు. రూ.520.39 కోట్ల అంచనా వ్యయంతో బ్యారేజీ నిర్మించగా నిర్మల్ జిల్లా ఆయకట్టుకు 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 4,896 ఎకరాలకు సాగునీరు అందం ఉంది. యాసంగి పంటకు సీఎం రేవంత్ రెడ్డి నీటిని విడుదల చేయడంతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తం అయింది. సీఎం వెంట మంత్రి ఉత్తరం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, కలెక్టర్ అభిలాష అభినయ్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
