Telangana | రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ

Telangana | రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ
Telangana | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ అని అంబేద్కర్ యువజన సంఘం (Ambedkar Youth Association) అధ్యక్షులు దిలీప్ (Dilip) అన్నారు. బుధవారం పాత కొమ్ముగూడెంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల అభ్యున్నతికే రాజ్యాంగం పని చేస్తుందని, రాజ్యాంగ రక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు. రాజ్యాంగం ద్వారానే సమసమాజ నిర్మాణం సాధ్యమౌతుందన్నారు.
రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని అంబేద్కర్ (Ambedkar) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందడంతో అందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సృజన్, ప్రసాద్, , ప్రశాంత్, పౌలు, సత్తయ్య, బి. ప్రసాద్, రాజయ్య, వెంకటేష్,అరుణ్,ప్రవీణ్, సోనూ,అనిల్ అంబేద్కర్ అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
