Telangana | బస్సులో 36మంది ప్రయాణికులు..

Telangana | బస్సులో 36మంది ప్రయాణికులు..
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ వద్ద ప్రమాదం జరిగింది.
ఏపీలోని నిడదవోలు నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులున్నారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
