Telangana | 108కు ఏమైంది..

Telangana | 108కు ఏమైంది..

  • గత 6 నెలలుగా నిలిచిన సేవలు
  • సేవలు అందక బాధితుల ఆవేదన

Telangana | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గ పరిధిలో అతిపెద్ద మండలం, మున్సిపాలిటీ కేంద్రం అయిన భీంగల్ మండలంలో అత్యవసర సేవల కోసం వినియోగించుకునే 108 సేవల వాహనం పాడైంది. గత 6 నెలల నుండి రాత్రి వేళల్లో మండలంలో 108 సేవలు నిలిచిపోయాయి. ఆపద వస్తే అత్యవసర సేవల కోసం ప్రైవేట్ వాహనాలను భాదితులు ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద బాధితులతో పాటు గ్రామాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పాము కాటు, కుక్కలు, కోతుల దాడికి గురైనా బాధితులను, గర్భిణుల సేవలు ఆస్పత్రిలో చికిత్స పొందేలా 108 అత్యవసర వాహనంలో తీసుకెళ్తుంటారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో రాత్రి వేళల్లో అత్యవసర సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

108 వాహనం రాత్రి వేళల్లో బ్రేక్ డౌన్ ఉండబట్టి 6 నెలలు దాటుతున్న వాహనాన్ని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులు చేయించకపోవడం ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో భీంగల్ 108 వాహనం బ్రేక్ డౌన్ అవడంతో మోర్తాడ్, కమ్మర్ పల్లి, సిరికొండ, దర్పల్లి, మండలల నుంచి అంబులెన్స్ వచ్చేవరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది 6 నెలలు దాటినా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. అధికారులు వెంటనే స్పందించి 108 వాహనం త్వరగా మరమ్మతు చేయించి రాత్రి వేళల్లో అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం లో 108 సిబ్బంది ని వివరణ కోరగా వాహనం రిపేర్ లో ఉండడం వలన ఇలాంటి ఇబ్బంది అవుతుందని, త్వరలో కొత్త వాహనం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Leave a Reply