Telangana | ఎన్నికల ప్రచారంలో రేవంత్‌..

Telangana | ఎన్నికల ప్రచారంలో రేవంత్‌..

Telangana | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రేపు కేరళలో పర్యటించనున్నారు.

త్రివేండ్రంలో ఆయన రోడ్‌షో నిర్వహించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున కీలక నాయకుల పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

రేపటితో కేరళలో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు చివరి దశ ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది

Leave a Reply