IndiGo | తిరుపతి – హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం !

తిరుపతి : తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర‌ ఆందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటిలోనే లోపం వెలుగుచూసి, దాదాపు 45 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

ఈ సమయంలో విమానంలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్లు అప్రమత్తమై సాంకేతిక లోపాన్ని గుర్తించి విమానాన్ని తిరిగి తిరుపతి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ప్రస్తుతం ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మరో విమానం ద్వారా వారిని గమ్యస్థానానికి పంపించే అవకాశముంది. ఈ ఘటనపై పూర్తి వివరాలను ఇంకా ఇండిగో వెల్లడించాల్సి ఉంది.

Leave a Reply