TDP village president | పల్స్ పోలియో విజయవంతం చేయాలి

TDP village president | పల్స్ పోలియో విజయవంతం చేయాలి
TDP village president ఘంటసాల, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఘంటసాల మండల పరిధిలోని గోగినేనిపాలెం గ్రామ పంచాయతీలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీడీపీ గ్రామ అధ్యక్షుడు సుబ్బారావు కుంపటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
