TDP | మండల అధ్యక్షులుగా నాగేశ్వరరావు..

TDP | మండల అధ్యక్షులుగా నాగేశ్వరరావు..
TDP, గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా గోపి వెంకట నాగేశ్వరరావును (గోపి నాగబాబు) పార్టీ అధిష్టానం నియమించింది. పెడన నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ సాధారణ పార్టీ కార్యకర్తకు కీలక బాధ్యత అప్పగించడం విశేషమని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. సామాజిక సమతా, సమగ్ర ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని వారు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న గోపి వెంకట నాగేశ్వరరావుకు ఈ అవకాశం దక్కడం పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపిందని, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
