పుంగనూరు, మార్చి15(ఆంధ్రప్రభ) : పాత కక్షలతో ఓ వ్యక్తి కొడవలితో దాడి చేయడంతో టీడీపీ నేత మృతిచెందిన ఘటన పుంగనూరు మండలం కృష్ణాపురంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. మండల పరిధిలోని కృష్ణాపురంలో శనివారం ఉదయం టీడీపీ నాయకుడు రామకృష్ణ, అతని కుమారుడు సురేష్ పై గతంలో వాలంటీర్ గా పనిచేసిన ఆమె భర్త వెంకటరమణ కొడవలితో దాడి చేయడంతో మృతిచెందాడు.
వీరి మధ్య పాత కక్షలున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వెంకటరమణ కొడవలితో రామకృష్ణ అతని కుమారునిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాయాలయ్యారు.క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణ పరిస్థితి విషమించడంతో అతన్ని తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా తనకు ప్రాణహాని ఉందని పోలీసులు పట్టించుకోవడం లేదని రామకృష్ణ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.