TDP | నేత వెంకట్రామయ్య మృతి
TDP, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం నాగాయతిప్పలో టీడీపీ (TDP) సీనియర్ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. వెంకట్రామయ్య మృతి పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వెంకట్రామయ్య భౌతికకాయాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ మండల అధ్యక్షుడు నడకుదుటి జనార్ధనరావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు నాగినేని శేషగిరిరావు, వేములపల్లి రవిచంద్ర, పీఏసీఎస్ చైర్మన్ బళ్ళ సీతారామ్ ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ పుప్పాల ఏసు, టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు.



