అమరావతి, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఒప్పందం కుదుర్చుకున్న ఐటీ కంపెనీ టీసీఎస్(IT company TCS). రూ.1370 కోట్ల పెట్టుబడితో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది. కేటాయించిన భవనాల్లో 100 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్(Minister Lokesh) చెప్పినట్టుగానే, టీసీఎస్ ఇప్పుడు కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సిద్ధమైంది.
విశాఖపట్నం మధురవాడ(Visakhapatnam Madhuravada) ఐటీ(IT) సెజ్‌లో టీసీఎస్ కార్యాలయం సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. హిల్ నం–3లోని మిలీనియం టవర్స్(Millennium Towers)లో టీసీఎస్ నేమ్ బోర్డు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఉద్యోగ నియామకాలు కూడా ప్రారంభమయ్యాయి. శాశ్వత కార్యాలయం సిద్ధం అయ్యే వరకు బీ బ్లాక్(B Block) మొత్తం, అలాగే ఏ బ్లాక్‌లోని 4 నుండి 7వ అంతస్తులు టీసీఎస్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోనుంది.