Tamilanadu | రాజ్యసభ ఎన్నిక‌లు .. డిఎంకె అభ్య‌ర్ధిగా క‌మ‌ల్ హాస‌న్

చెన్నై, ఆంధ్రప్రభ : తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మద్దతుతో నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే తనకున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం)కి కేటాయించాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎగువ సభకు హాసన్ నామినేట్‌ను నిర్ధారిస్తూ.. ఎంఎన్​ఎం తీర్మానాన్ని ఆమోదించింది.

మ‌రో ముగ్గురు లీడ‌ర్లు వీరే..

నవరసకళా నాయకుడు కమల్ హాసన్ రాజకీయ ప్రయాణం 2018లో ప్రారంభమైంది. కాగా, రానున్న రాజ్యసభ ఎన్నికలకు డీఎంకే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. డీఎంకే ప్ర‌క‌టించిన మ‌రో ముగ్గురు అభ్యర్థుల్లో సీనియర్ న్యాయవాది పి. విల్సన్, కవి, రచయిత్రి సల్మా, మాజీ మంత్రి ఎస్ఆర్ శివలింగం ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎంఎన్‌ఎంతో కుదుర్చుకున్న ఎన్నికల ఒప్పందానికి అనుగుణంగానే క‌మ‌ల్‌ హాసన్ పార్టీకి ఒక సీటు కేటాయించినట్లు అధికార డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

Leave a Reply