march 5| అదేమిటంటే..?

march 5| అదేమిటంటే..?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 విజయానికి కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది టీమిండియా. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 5, గురువారం) ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ లో తలపడనుంది. సూపర్-8 లో భయంకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిండిస్ ను చిత్తుచేసిన సూర్య సేన రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ కు చేరింది. ఈ వరల్డ్ కప్ లో మొదటిసారి ఇంగ్లాండ్ తో తలపడుతోంది. అయితే ఓ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

ఇది మూడోసారి..
టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్- భారత్ సెమీఫైనల్ ఆడడం వరుసగా ఇది మూడోసారి. 2022లో తొలిసారి భారత్ -ఇంగ్లాండ్ ఢీ కొట్టాయి. ఇందులో ఇంగ్లాండ్ నెగ్గి ఫైనల్‌కు వెళ్లింది. తుదిపోరులో పాకిస్థాన్‌ను మట్టికరిపించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక 2024 సెమీస్‌లోనూ ఈ ఇరుజట్లు పోటీ పడ్డాయి. ఈసారి భారత్ నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిదిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అలా గత రెండుసార్లు సెమీస్‌లో గెలిచినోళ్లే ఛాంపియన్ అయ్యారు. ఈసారి కూడా ఇదే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.
