SWATHI | అవకాశం కల్పిస్తే.. మరింత అభివృద్ధి చేస్తా..
నాగిరెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గోవింద్ గౌడ్.
SWATHI | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీని మొదటిసారి తన భార్య స్వాతికి అవకాశం ఇచ్చి గెలిపించారని, మరోసారి తనకు అవకాశం కల్పిస్తే మంత్రి సహకారంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని నాగిరెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ మద్దతు అభ్యర్థి గోవింద్ గౌడ్ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా తనను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానన్నారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే నాగిరెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారుస్తామన్నారు. తన భార్య స్వాతి సర్పంచ్ గా ఐదేళ్లు పాలన చేపట్టడంతో సమస్యలపై పూర్తి పట్టు ఉన్న తనను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వాతిగౌడ్, వార్డు అభ్యర్థులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

