తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
పుత్తూరులోని ఓ చర్చిలో ప్రార్థనలు చేసినట్లే అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్ చేశాడు. ఇక, దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా ఏఈవో రాజశేఖర్ బాబుని ఈవో శ్యామలరావు సస్పెండ్ చేశారు.