సూర్య ఫిట్.. పాసైన ఫిటెనెస్ టెస్టు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ (Suryakumar Yadav) ఆసియా కప్ (Asia Cup) బరిలో దిగుతాడా..? లేదా..? అన్న అనుమానాలు తొలిగిపోయాయి. టోర్నీలో అతను పాల్గొనడం ఖాయమే. ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించు కున్న అతను ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ (fitness test) సాధించాడు. తాజాగా బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ నిర్వ హించిన ఫిట్నెస్ టెస్టులో సూర్య పాసయ్యాడు. ‘సూర్య ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేశాడు. ఆసియా కప్లో భారత జట్టును నడిపించడానికి అతను అందుబాటులో ఉంటాడు. సర్జరీ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్లో రిహా బిలిటేషన్లో ఉన్నాడు. భారత జట్టు సెలెక్షన్ మీటింగ్కు అతను హాజరవుతాడు.’అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19న ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ముంబైలో సెలెక్షన్ మీటింగ్ జరగనుండగా.. ఆ సమావేశంలో సూర్య కూడా పాల్గొంటాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 10న టీమిండియా తమ తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది.

Leave a Reply