suicide attempt | గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

suicide attempt | గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
suicide attempt | తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన తిరుమలలోని ఆర్బీ సెంటర్(RB Centre) సమీపంలో చోటు చేసుకుంది. పదునైన చాకుతో గొంతు, పొట్ట భాగాన్ని కోసుకున్నాడు. అంతేకాకుండా పొట్ట పేగుల్ని బయటకు తీసుకున్నాడు.
ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మానసిక రోగిగా తెలుస్తోంది. అతని కుడి చేతిపై సిలువ ఉన్న పచ్చబొట్టు ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు(Police) బాధితుడిని మొదట అశ్విని ఆసుపత్రికి, అనంతరం తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి(Sims Hospital) తరలించారు.
