పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థిక బలం

పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థిక బలం

  • ముచ్చింపుల తండలో విజయవంతంగా పశు వైద్య శిబిరం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచ్చింపుల తండ గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మచ్చిక రవి మరియు ఉప సర్పంచ్ గుగులోత్ శోభన్ ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 70 పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. అనంతరం మండల పశువైద్యాధికారి డాక్టర్ వేణు మాట్లాడుతూ.. గాలి కుంటు వ్యాధి పశువులకు సోకితే అవి నిరసించి అధిక జ్వరంతో బాధపడతాయని తెలిపారు.

ఈ వ్యాధి వల్ల పశువుల నోటిలో మరియు కాళ్లలో పుండ్లు ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని వివరించారు. అలాగే ఈ వ్యాధి సోకిన పశువులలో పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పని సామర్థ్యం క్షీణించడం జరుగుతుందని, కొన్ని సందర్భాల్లో సంవత్సరంలోపే పశువులు మరణించే ప్రమాదం ఉందని అవగాహన కల్పించారు. రైతులు తప్పనిసరిగా తమ పశువులకు టీకాలు వేయించుకొని ఈ వ్యాధి నుండి రక్షణ కల్పించుకోవాలని ఆయన సూచించారు.

జాతీయ గాలి కుంటు వ్యాధి నివారణ కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కరుణాకర్, నరసింహ, వంశీతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply