Subrahmanyeswara Swamy | టేకు రథం..

Subrahmanyeswara Swamy | టేకు రథం..
Subrahmanyeswara Swamy, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్నటేకు రథo నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు కోటి రూపాయల వ్యయంతో శ్రీ స్వామి వారికి టేకు రథాన్ని నిర్మించి అందజేయనున్నారు.
ఈ నెల 21వ తేదీన రథం నిర్మాణ పనులు ప్రారంభించగా ప్రస్తుతం రెండవ అంతస్తు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాబోయే ఫిబ్రవరి నెలలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో నూతన రథంతో స్వామివారి రధోత్సవం నిర్వహించేల పనులు వేగంగా జరుగుతున్నాయి.
