సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…
16 వెల రూపాయలు అనధికారికంగా ఉన్న డబ్బు స్వాధీనం..
ఫోన్ పే ట్రాన్సాక్షన్ గుర్తించిన ఏసీబీ అధికారులు..
కార్యాలయంలో ముగ్గురు అనధికార సిబ్బందిని గుర్తించిన ఏసీబీ…
కార్యాలయంలో 12 మంది డాక్యుమెంటరీ రైటర్లు ఎల్లవేళలా…
ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్…
సబ్ రిజిస్టార్ కు ఆదివారం 37వెల రూపాయలు పంపిన…
స్క్రీన్ షాట్ లో దొరికిన వైనం..
అండర్ వ్యాల్యూ వేసి ప్రభుత్వానికి ట్యాక్సీ కొట్టిన వైనం..
ఏసీబీ డీఎస్పీ సోమన్న…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏ కార్యాలయం చూసినా ఏమున్నది గర్వకారణం… అందందు వెతికిన అవినీతి బయట పడుతూ ఉండటం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను బట్టి అవినీతి జిల్లా స్థాయిలో ఏ మేర పాతుకు పోయిందో తెలుస్తుంది. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక దాడులు చేస్తున్న విషయం విధితమే. ఇటీవల కాలంలో నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ డోన్ ఆత్మకూరు, జూపాడు బంగ్లా వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంఘటనలు జరిగాయి.
ఆ సంఘటనలు మరువకముందే సోమవారం నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు డిఎస్పి సోమన్న ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చెయ్యి తడపందే ఆ కార్యాలయంలో పనులు జరగవు అనే నానుడి ఉంది. బల్ల కింద సొమ్ము పెడితేనే ఆ కార్యాలయంలో ఏ పనైనా జరుగుతుంది. దొంగ రిజిస్ట్రేషన్లు కూడా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవినీతికి నిలయంగా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయం పై జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న సోమవారం ఆకస్మికంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు చేపట్టారు. సోమన్న తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తో పాటు పలువురు వద్ద సొమ్ము అనాథరైజ్డ్ గా అనధికారికంగా దొరికిందని చెప్పారు.

హుస్సేన్ పీరా అనే వ్యక్తి వద్ద 10,100 రూపాయలు, జనార్ధన అనే వ్యక్తి టేబుల్ దగ్గర 3500 రూపాయలు, మరొక వ్యక్తి దగ్గర 250 రూపాయలు దొరికాయి అన్నారు. జిల్లా కేంద్రమైన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ కూడా వేల రూపాయల్లో జరిగినట్లు స్క్రీన్ షాట్ ద్వారా మేము గుర్తించామని ఏసీబీ డిఎస్పి సోమన్న తెలిపారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఓ వ్యక్తి నుంచి 37 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా సబ్ రిజిస్టర్ చేరాయని ఆ స్క్రీన్ షాట్ ని కూడా మేము తీసుకున్నామన్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.వీటితోపాటు చాలా సొమ్ము ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ జరిగిందని వాటన్నిటిని కూడా లెక్క కడుతున్నామన్నారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనధికారికంగా ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారిని నియమించుకోకూడదు అన్నార. వీరి ద్వారానే వారు సొమ్మును ట్రాన్సాక్షన్ చేస్తున్నారని తెలిసిందన్నారు. వీరి ముగ్గురి ద్వారా డబ్బు కలెక్ట్ చేసుకోవడం అధికారులకు పంపటం జరుగుతుందన్న పలు ఫిర్యాదులు మాకందాయి. ప్రైవేటు వ్యక్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనధికారికంగా నియమించుకోకూడదు. కానీ ఇక్కడ నియమించుకోవటంలో ఉన్న అంతర్థానం పరమార్థం మేము గ్రహించామన్నారు.
అనదికార వ్యక్తుల పేర్లను కూడా తెలిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మేము దాడులు చేసినప్పుడు 12 మంది డాక్యుమెంటరీ రైటర్స్ కార్యాలయంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంటరీ రైటర్లు ఉండకూడదు అన్నారు.ప్రభుత్వం అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టినప్పటికీ కార్యాలయంలోనే వీరు ఉండటం అందులో ఉన్న గూడార్థం ఏమిటో మేము గ్రహించగలమన్నారు. కమర్షియల్ బిల్డింగ్ ను రెసిడెన్షియల్ బిల్డింగ్ గా చూపించి అండర్ వేల్యూషన్ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వానికి రావలసిన ట్యాక్సీని లక్షలాది రూపాయలు ఎగ్గొట్టుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు.
తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ కూడా వేలాది రూపాయలు తీసుకుని చేస్తున్నారని ఆరోపణలు ఈ కార్యాలయం పై వచ్చాయన్నారు. జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో సురేఖ అనే జూనియర్ అసిస్టెంట్ మహిళ కు కూడా కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ అయిన హుస్సేన్ పీరా అనే వ్యక్తి ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేపట్టాడని చెప్పారు. వీటన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
మొత్తం పై సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నట్లు డిఎస్పి సోమన్న తెలిపారు. ఓ పక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరుగుతుంటే డాక్యుమెంటరీ రైటర్లు అన్ని షాపులను మూసివేయడం విశేషం.ప్రభుత్వ సీనియర్ లెక్చరర్లు పంచాయతీ దారుల సమక్షంలో ఏసీబీ సిబ్బంది పంచనామా చేస్తున్నారు. కెసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.
