Jagtial | విద్యార్థుల ఆందోళన..

Jagtial | విద్యార్థుల ఆందోళన..

ఇన్ చార్జి ప్రిన్సిపాల్ బూతులు తిడుతున్నాడని విద్యార్థుల ఆరోపణ…


Jagtial | జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలోని ఖిలాగడ్డ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పాఠశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రవి మహేంద్ర (Ravi Mahendra) తమను బూతులు తిడుతూ, కొడుతూన్నాడని సోమవారం పాఠశాల ముందు రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ… పాఠశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ (Principal) రవి మహేంద్ర గత కొన్ని రోజులుగా విద్యార్థులతో బూతులు మాట్లాడుతూ, కొడుతున్నారని, ఇది ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తే బయటకు రా చూసుకుందామని విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రిన్సిపాల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు (students) డిమాండ్ చేశారు. అనంతరం ఈ విషయమై ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రవి మహేంద్రను సంప్రదించగా, విద్యార్థులతో బూతులు మాట్లాడటం, కొట్టడం చేయలేదని, విద్యార్థులను కొన్ని విషయాల్లో మందలిస్తే విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

Leave a Reply