Students | అందరూ బాధ్యత తీసుకోవాలి..

Students | అందరూ బాధ్యత తీసుకోవాలి..

Students, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, అప్పుడే సమాజం పచ్చదనంతో పరిఢవిల్లుతుందని సత్యభారతి స్కూల్ ప్రిన్సిపాల్ బి.నాగలక్ష్మి అన్నారు. స్థానిక సత్యభారతి ఇ.మీ. స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు ఐటీసీ, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (వావ్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సేకరించిన 450 కేజీల ఓల్డ్ బుక్స్, పేపర్స్ తదితర వాటిని ఓల్డ్ బుక్స్ ఏజెన్సీ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యభారతి ఇ.మీ. స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమైన చెట్లను కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.

వావ్ ప్రతినిధి రాజు మాట్లాడుతూ.. ఒక టన్ను పేపరు తయారీ కావాలంటే.. 17 చెట్లు అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ రీసైక్లింగ్‌కు సహకరిస్తే చెట్లను కాపాడుకోవచ్చు అన్నారు. అనంతరం వివిధ అంశాల్లో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply