Students | గణిత ప్రతిభ పరీక్ష

Students | గణిత ప్రతిభ పరీక్ష
Students | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ భీంగల్ పాఠశాలలో శనివారం మండల స్థాయి గణిత పరీక్షలు నిర్వహించారు. గణిత పరీక్షలో భీంగల్ మండలంలోని 15 హైస్కూళ్ల నుండి విద్యార్థులు (Students) ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్షలో తెలుగు మీడియం నుండి భీంగల్ గర్ల్స్ హైస్కూల్ కు చెందిన విద్యార్థినిలు లక్షణ, మాధురి, హర్షిని, ఇంగ్లీష్ మీడియం నుండి జడ్పీహెచ్ఎస్ కు చెందిన లక్ష్మీపతి ప్రథమ స్థానం జడ్పీహెచ్ఎస్ మెండోరాకు చెందిన తేజస్విని ద్వితీయ స్థానం జడ్పీహెచ్ ఎస్ పల్లికొండకు చెందిన అశ్విత తృతీయ స్థానం పొందారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి స్వామి, గణితపురం అధ్యక్ష కార్యదర్శులు రాములు, శ్రీనివాస్, పీఆర్టీయూ అధ్యక్షులు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
