students | విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు….

students | విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు….
students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రీడారంగంలో రానిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఊట్కూర్ తాహసిల్దార్ చింతా రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఎస్ జి ఎఫ్ ఉమ్మడి జిల్లా అండర్ 14 బాల బాలికల జట్ల ఎంపిక చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహద పడతాయని అన్నారు.
క్రీడల్లో ప్రతిభ చాటితే ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. ఊట్కూర్ లో జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలన్నారు. విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు.
ఉమ్మడి జిల్లా అండర్ 14 బాల బాలికల జట్టు ఎంపికకు 120 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం కుసుమ డి వై ఎస్ ఓ శెట్టి వెంకటేష్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, పీడీ లు సాయినాథ్, బాలరాజ్, రాజశేకర్, నాగరాజ్, రాఘవేందర్, సుగుణ, నాగమణి, గణేష్, బాలంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
