క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

నల్గొండ, ఆంధ్ర ప్రభ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అధికారిని వి. జ్యోతిర్మయి(V. Jyotirmayi) ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రోజు ఆహార భద్రత శాఖ అధికారులు స్వీట్స్ షాపులు, స్పైసెస్ తయారీ కేంద్రాలు, రీటైల్ యూనిట్స్ లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 స్వీట్స్ తయారీ కేంద్రాలలో 7 స్పైసెస్ తయారీ, రిటైల్ కేంద్రాలలో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్(Mobile Food Testing Lab)ను ఉపయోగించి స్పాట్ టెస్ట్ నిర్వహించారు.

అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్ల తయారీ, పసుపు, కారం, ఫుడ్ హ్యాండ్స్, హెయిర్ క్యాప్స్, గ్లౌజులు ధరించకపోవడం, పురుగులతో నాణ్యత లోపించిన ముడి సరుకులు ఉపయోగించడం వంటివి గుర్తించడం జరిగిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా జోనల్ అధికారిని వి.జ్యోతిర్మయి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను 17 స్వీట్ షాప్, స్పైసెస్ దుకాణదారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

సుమారు 48 కిలోల స్వీట్లు(48 ​​kg sweets), కాలం జ‌ల్లిన ఆహార పదార్థాలు, 5 కిలోల పురుగులు పట్టిన ధనియా పొడిని ప్రజల ఆరోగ్య నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగిందన్నారు. సుమారు 90 కిలోల ఆహార పదార్థాలు, 50 కిలోల పురుగులతో కూడినటువంటి మైదా పిండిని సీజ్ చేసి, 27 అనుమానిత శాంపిల్స్ ను పరీక్ష నిమిత్తం ల్యాబ్(Lab) కు పంపడం జరిగిందని నివేదిక ఆధారంగా ఆహార కల్తీ అని నిర్ధారణ అయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఆహార కల్తీకి పాల్పడిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తరచూ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్(Special Drives) నిర్వహించబడుతుందని, వ్యాపారస్తులు అప్రమత్తమై ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply