నిలిచిన రాకపోకలు

నిలిచిన రాకపోకలు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి(Peddapally) మండలం కొత్తపల్లి గ్రామ వద్ద రైల్వే అండర్ పాస్(Railway Underpass) వరద నీటితో నిండి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ బ్రిడ్జి కింది భాగంలో వరద నీరంతా నిలిచి ఎస్సారెస్పీ(SRSP) ప్రధాన నీటి కాల్వను తలపిస్తోంది.

దీంతో పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి కొత్తపల్లి, కొలనూర్(Kolanur), పొత్కపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయి ప్రజలు నాన అవస్థలు పడుతున్నారు. కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్(Tractor) రైల్వే అండర్ బ్రిడ్జిలో చిక్కుకు పోయింది. తృటిలో డ్రైవర్(Driver) చాకచక్యంగా తప్పించుకున్నాడు.

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద వర్షం నీరు పోయేందుకు పైపులు ఏర్పాటు చేసినా ఆ నీరంతా వెళ్ళడం లేదు. ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని తొలగించే చర్యలు చేపట్టినా వరద నీరు ఇంకా చేరుతుండటంతో బ్రిడ్జి(Bridge) కింద నుండి రాకపోకలు సాగడం లేదు. రైల్వే అధికారులు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని, మూసిన రైల్వే గేటు(Railway Gate)ను పునరుద్దరిస్తే ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాల‌కు ఇబ్బందులు ఉండవని వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply