మౌనం కాదు.. చేతల్లో చూపించండి..

మౌనం కాదు.. చేతల్లో చూపించండి..
యుద్ధంపై భారత్ స్పష్టమైన స్థానం తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్చార్జ్ వల్లూరు భార్గవ్
విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు భర్గవ్ వల్లూరు తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై భారత్ స్పష్టంగా ఎదురు నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారి సోషల్ మీడియా ఖాతాలను మూసివేయడం, ప్రచార చిత్రాలను ప్రోత్సహించడం వంటి చర్యలు నాయకత్వ లక్షణాలు కావని, నియంత్రణకు సంకేతమని ఆయన ఆరోపించారు.
దేశంలో గ్యాస్, ఇంధన సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయని, స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మొదట సంక్షోభం లేదని చెప్పి, అనంతరం ఉన్నత స్థాయి సమావేశం తర్వాత సంక్షోభం ఉందని అంగీకరించడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి కొందరి లాభాల కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపిస్తూ, ప్రధాని రాజీనామా చేయాలని భర్గవ్ వల్లూరు డిమాండ్ చేశారు.
