State | అందుబాటులో ఉండి ప్రజల సేవ చేస్తా

State | అందుబాటులో ఉండి ప్రజల సేవ చేస్తా
State | ధర్మపురి, ఆంధ్రప్రభ : దొంతపూర్ గ్రామ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని దొంతపూర్ సర్పంచ్ అభ్యర్థి వేముల ఉదయశ్రీ ఓటర్లను కోరారు. ఈ రోజు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ తన మార్కు చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. దొంతపూర్ గ్రామాన్ని మండలంలో ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు.
