State Govt | మర్యాదపూర్వకంగా..

State Govt | మర్యాదపూర్వకంగా..
- ఎమ్మెల్యే యార్లగడ్డను కలిసిన జంక్షన్ సీఐ
State Govt | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : హనుమాన్ జంక్షన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన లోధన రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ(State Govt) విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా యార్లగడ్డకు సీఐ పూల మొక్కను బహూకరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, హనుమాన్ జంక్షన్(Hanuman Junction) సర్కిల్ పరిధిలో ప్రజల సుఖశాంతులతో జీవించేందుకు కృషి చేయాలని యార్లగడ్డ సూచించారు. కోడిపందేలు, పేకాట నియంత్రించాలని ఆదేశించారు.
