చట్టం రూపంలో తీసుకురావడం ఒక మైలురాయి…

చట్టం రూపంలో తీసుకురావడం ఒక మైలురాయి…
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతికి పార్లమెంట్ లో చట్టం రూపంలో తీసుకు రావడం అనేది ఒక మైలురాయి. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం పథకంలో భాగంగా బుధవారం ఉరవకొండ మండలంలోని లత్తవరంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారితో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కా రానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కూటమికి వేసిన ఒక్క ఓటు వల్ల రాష్ట్రానికి వందల లాభాలు చేకూరిందని, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తోంది అనడానికి అమరావతి రాజధాని మరో మైలురాయి అన్నారు. ఒక్క ఓటుతో అమరావతికి వేలకోట్ల సహాయాన్ని కేంద్రం అందించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిందని, విశాఖ ఉక్కును కాపాడిందని, రైల్వే లైనులకు 70 వేల కోట్ల పెట్టుబడి ఇచ్చిందని, 70 వేల కోట్లతో మరో జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిందని, గూగుల్ ప్రాజెక్ట్ లు రావడానికి, ప్రజలు వేసిన ఒక ఓటుకి కూటమి ప్రభుత్వం న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు.
మరో మైలురాయి అమరావతిని చట్టబద్ధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కేంద్రంలో, పార్లమెంట్ లో చట్టం రూపంలో తీసుకురావడం అనేది ప్రజలు వేసిన ఓటుకి మరో ముందడుగు, మరొక నమ్మకాన్ని కలిగించే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టి శాశ్వతంగా ఉండేలా, అమరావతి అంటే అది ఒక రాజధాని కాదని, రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి యువకుడికి ఒక ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశం అని, ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి స్థానం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారన్నారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఈరోజు పార్లమెంట్లో అమరావతి రాజధాని అని చట్టం జరగబోతున్నందుకు ప్రతి ఆంధ్రుడు గర్వపడాలన్నారు. దానికి కృషి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఆంధ్రుడు రుణపడి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మరొకసారి మోసపోకుండా ఉండేందుకు చట్టం రూపంలో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, కొర్రపాటి మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయభాస్కర్, పెన్నాహోబిలం ఆలయ చైర్మన్ రేగంటి నాగరాజు టిడిపి నాయకులు ప్యారం కేశవ, మఠం గంగాధర్, ఇంద్రావతి వెంకటేశులు, రామకృష్ణ, ఓబులేసు, లత్తవరం గిరి, సీతారాముడు తదితరులు పాల్గొన్నారు.
