కడియం వెంటనే రాజీనామా చేయాలి!

కడియం వెంటనే రాజీనామా చేయాలి!

  • మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పై ఫైర్..
    -కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కేవలం 10 శాతం ఓట్ల తేడా మాత్రమే
  • ప్రజాభిప్రాయం ఇంకా బీఆర్ఎస్ వైపే ఉంది.
  • తెలంగాణ సాధనలో కేసీఆర్ త్యాగాలు మరువలేనివి!
  • బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు
  • తెలంగాణ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు
  • స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ ప్రభు త్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మ కాన్ని ద్రోహం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం వెంట నే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కేవలం 10 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్న ప్పటికీ, ప్రజాభిప్రాయం ఇప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉందని రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో అపార త్యాగాలు చేసిన కే.చంద్ర శేఖర్ రావు సేవలను ఎవరూ మరవలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన ఉద్యమం, దీక్షలు, పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయ కులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముందుగా కేసిఆర్ గురించి పలు అంశాలు మాట్లా డారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం, కడియంపై తీవ్రంగా మండిప డ్డారు.

  • తెలంగాణ సాధనలో ప్రాణాలు పణంగా పెట్టిన నాయకుడు కేసీఆర్:

తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేంద్ర ప్రభు త్వాన్ని మెడలు వంచించి రాష్ట్రాన్ని సాధించారనే ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన నాయ కుడు కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ నియో జకవర్గ ప్రజల తరఫున కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.

  • మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్:
    ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని రాజయ్య ఆరోపించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో గద్దెనెక్కారని విమర్శిం చారు. కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇవ్వలేదు. విద్యార్థినిలకు స్కూటీలు అందించలేదు. రైతు భరోసా పెంపు చేయ లేదు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు పెంచలేదు. రెండేళ్లు దాటినా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలే దని మండిపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ అధికా రంలోకి వస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
  • బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయి:

స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలిపై రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబా ద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ, నియోజకవర్గానికి రాగానే కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరించడం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందన్నారు. నిజంగా కాంగ్రెస్ బలంగా ఉందని భావిస్తే వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు తీసుకోవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎ స్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫామ్‌తో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

  • మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 10శాతం ఓట్ల తేడా:

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కేవలం 10 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని రాజయ్య పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ వైఫల్యం దీనివల్ల స్పష్టమవుతోంద న్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ సభలో ప్రజా సమస్య లపై గళం వినిపించాలని సూచించారు. ఓడిన నాయకులు కూడా తమ వార్డుల్లో ఇన్‌చార్జిలుగా పని చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

  • అవసరమైతే న్యాయపోరాటం:

రాజ్యాంగాన్ని అవహేళన చేసే చర్యలను ఖండిస్తున్నామని రాజయ్య తెలిపారు. అవసరమైతే న్యాయస్థానాల ద్వారా న్యాయం సాధిస్తామని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ప్రజాక్షేత్రం లో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు తిరిగి అమలులోకి వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని రాజయ్య పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు తాటికొండ మధు, బూర్ల రాజేశ్వ ర్, చల్లా రమ్య రఘు రెడ్డి, బాలగాని అనిల్ గౌడ్, పొన్న రాజేష్, బిఆర్ ఎస్ నాయకులు తాటికొండ సురేష్, ఇనుగాల నర్సింహా రెడ్డి, చందర్ రెడ్డి, శీలం శ్యామ్ కుమార్, మునిగెల రాజు, గుండె మల్లేష్, ఆకారపు అశోక్, మునిగెల మహేష్, మహ్మద్ జబ్బార్, చిట్టీ బాబు, అనిల్, సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply