House arrest | శ్రీనివాస్‌గౌడ్‌కు గృహనిర్బంధం.. పోలీసులతో తోపులాట

House arrest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు. తాను అవినీతి చేయలేదని బీరంగూడలోని మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ ఆలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయనను గృహనిర్బంధం చేశారు. అయితే కార్యకర్తల సహాయంతో బయటకు రావడానికి ప్రయత్నించిన శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరాయి. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుని, కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
