Srikakulam | వరి పంట దగ్ధం..

  • 20 ఎకరాలు బుగ్గిపాలు..

శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చేతికొచ్చిన వరి పంట మంటల్లో పూర్తిగా కాలిపోయింది. జిల్లుండ శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వరి పంట క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

ఉద్దేశపూర్వకంగానే దుండగులు వరి పొలాలకు నిప్పు పెట్టి ఉండవచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, పొలాల్లోకి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లలేకపోయాయి. దీంతో మంటలను అదుపు చేయడం సాధ్యపడలేదు.

కోతకు సిద్ధంగా ఉన్న సమయంలోనే పంట పూర్తిగా దగ్ధమవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ దారుణానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply