Sridhar Babu | మూసీ డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదు

Sridhar Babu | మూసీ డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదు
Sridhar Babu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే… బఫర్‌జోన్ నిర్ణయించామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… హరీశ్‌రావు బీఏసీలో చెప్పిన మాటలను వారి సభ్యులకు చెప్పాలన్నారు. తాము కొత్తగా బఫర్‌జోన్ నిర్ణయించలేదన్నారు. 2024 డిసెంబర్లో మెయిన్‌హార్ట్‌కు డీపీఆర్ బాధ్యతలు అప్పగించామన్నారు.
2026 ఫిబ్రవరిలో మెయిన్‌హార్ట్ సంస్థ డీపీఆర్ కు అప్పగించిందన్నారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు మూసీ డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదన్నారు. వచ్చే ఏడీబీ బోర్డు మీటింగ్‌లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశముందన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఆపేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుందన్నారు. ప్రాజెక్టులను తాము నిలిపేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదన్నారు.
ఎస్టీపీలకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 30శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పెండింగ్‌లో ఉన్న 70శాతం పనులు తమ హయాంలో పూర్తయ్యాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయన్నారు. మురికి కాలువగా ఉన్న జీవనది మూసీని అభివృద్ధి చేయడం తప్పా? మూసీ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
