యువత రాజకీయంలోకి రావాలి

యువత రాజకీయంలోకి రావాలి

యువ నాయకుడైన పెంటరి రాజేందర్ గెలవాలి
నిస్వార్థ సేవ చేసే రాజేందర్ ను ఆశీర్వదించండి
మంత్రి శ్రీధర్ బాబు

మంథని: నేటి తరం యువత రాజకీయాల్లో రాణించాలని, యువ నాయకుడైన పెంటరి రాజేందర్ నిస్వార్ధమైన యువ నాయకుడిని ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం అందరపైన ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ సామాన్యులను ఆదరించిందని, ఆ సామాన్యులను ప్రజలు ఆశీర్వదించాలని ఆయన పేర్కొన్నారు. పదో వార్డు తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంటరి రాజేందర్ చిన్ననాటితనం నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎదిగాడని ఆయన గుర్తు చేశాడు. యువకుడు గెలిస్తే యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని, పదో వార్డు ప్రజలందరూ ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేసి రాజేందర్ ను ఆశీర్వదించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు .

Leave a Reply