రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
మేడ్చల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ తెలిపారు. శ్రీరాముని జీవితం సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యనిష్ఠలకు ప్రతీకగా నిలిచిందని, ఆయన ఆచరణలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆనందం, ఐక్యత, శాంతి పరిపూర్ణంగా నెలకొనాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
సమాజంలో పరస్పర గౌరవం, సహనంతో కూడిన వాతావరణం నెలకొల్పడంలో శ్రీరాముని సిద్ధాంతాలు అందరికి ప్రేరణగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు ఆధ్యాత్మికతతో పండుగను జరుపుకోవాలని, సంప్రదాయాలను కాపాడుకుంటూ సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని సురేందర్ ముదిరాజ్ సూచించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
